శ్రీరెడ్డి టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కోచ్ మీద పోరాటమని మొదలు పెట్టి చివరికి అది పవన్ కళ్యాణ్ ని అసభ్యకరమైన పదజాలంతో తిట్టే వరకు వచ్చింది. తను తిట్టడం వెనకాల రామ్ గోపాల్ వర్మ ఉన్నారన్న విషయం తెలిసినదే. నాగార్జున,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం ప్రోమోషన్స లో భాగంగా ఒక విలేఖరి పవన్ విషయం లో శ్రీరెడ్డి ని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు అని అడిగారు. దానికి సమాధానంగా వర్మ మాట్లాడుతూ ఈ విషయం పై మొత్తం వివరణ ఒక వీడియో రూపంలో ఇదివరకే చెప్పానని,ఎవరికైనా ఈ విషయం పై ఆసక్తి ఉంటే తన వీడియో చూసుకోవచ్చన్నారు. తాను ఎన్నడూ దేనిని పెద్దగా పట్టించుకోనని ముందుకు వెళుతూ ఉండడమే తన కర్తవ్యమని అన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments