మరో కీలక నేత పాదయాత్ర…

0
302

వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసినదే. తాజాగా ఇంకొక నేత పాదయాత్ర చెప్పట్టారు. జగన్ పాదయాత్ర 2000 కి మీ పూర్తి చేసుకున్న సందర్భంగా పులివెందుల ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు మేయర్ సురేష్ బాబు,వై ఎస్ మనోహర్ రెడ్డి మద్దత్తు పలికారు.

ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల ప్రాంతానికి కృష్ణ జలాలు రావడానికి వైఎస్సార్‌ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పాదయాత్ర సాగిస్తున్నామన్నారు.  చంద్రబాబు మోసాలతో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. ఈ రోజు పులివెందుల నుంచి వేముల చెరువు వరుకు, రేపు పులివెందుల నుంచి ఎర్రబెల్లి చెరువు వరకు పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here