తెలుగు హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి మెగా హీరో వరుణ్ తేజ్ చేరారు. ఘాజి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప రెడ్డి. ఇప్పుడు ఈయన దర్సకత్వం లో వరుణ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ అస్ట్రోనాట్ గా కనినిపించానున్నారు. దీని కోసం జీరో గ్రావిటీ లో ట్రైనింగ్ తీసుకున్నారు. అంతరిక్షం నేపధ్యంలో జరిగే ఈ చిత్రం కోసం స్పేస్ షటిల్తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ,లావణ్య త్రిపాఠి లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, దర్శకులు క్రిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Subscribe
Login
0 Comments