సామాన్యంగా ఓవర్నైట్ లో స్టార్ స్టేటస్ సంపాదించడం చాలా కష్టం. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ప్రియా వారియర్ ఒకరు. ఒక మలయాళం చిత్రంలో  తన కొంటె కనుసైగలతో మొత్తం ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. ఈ స్టార్ స్టేటస్ వలన ఆమెకు చాల అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్అంబాసిడర్ అయ్యారు. షాపింగ్ మాల్ కు సంబంధించిన యాడ్ ను  ప్రముఖ యాడ్ మేకర్ యమునా కిషోర్ దర్సకత్వం వహించారు. ఈ విషయాన్ని ప్రియా వారియర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపారు. తను ఇక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్అంబాసిడర్ అని,కిషోర్ గారి టీం తో పని చేయటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ పోస్ట్ ని యమునా కిషోర్ గారు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా షేర్ చేసారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments