అక్కినేని నాగార్జున,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో చాలా కాలం తరువాత వస్తున్నా సినిమా “ఆఫీసర్”. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక వీడియో రిలీజ్ చేసింది. దీంట్లో రామ్ గోపాల్ వరమల్ మాట్లాడుతూ చాలా కాలం తరువాత మంచి కథ రాశామని, దాన్ని అక్కినేని నాగార్జునకు చెప్పామని అన్నారు. ‘ఆఫీసర్’ సినిమాను మనసు పెట్టికాదు, మైండ్ పెట్టి తీశానని, ఈ రెండింటికీ తేడా ఏంటో సినిమా చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ సినిమా చూస్తోన్న ప్రేక్షకులు కొత్త అనుభవాన్ని పొందుతారని అన్నారు. రేపు ఈ సినిమా ట్రైలర్ వచ్చేస్తోందని, దయచేసి దాన్ని చూడాలని నాగార్జునతో కలిసి తీసిన ఓ వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమా స్టోరీ తనకు బాగా నచ్చిందని, తాను నమ్మిన దాని కోసం పోరాడే ఆఫీసర్గా నటించానని నాగార్జున ఇదే వీడియోలో తెలిపారు.