ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నేరస్తుడని సీబీఐ తన విచారణలో తేల్చింది. ఈ ఘటనపై స్పందించిన టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ మృగాడు కుల్దీప్ను వెంటనే చంపేయాలని ట్వీట్ చేశాడు. కోర్టు దోషిని వీలైనంత త్వరగా చంపేస్తుందని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. అలాగే, మన సర్కారు ఒక్క రాత్రిలో కరెన్సీ నోట్లను మార్చేస్తోందని, అత్యాచార కేసుల్లో చట్టాలను మాత్రం మార్చట్లేదని మరో పోస్ట్ చేశాడు.
Subscribe
Login
0 Comments