కర్ణాటక ఎన్నికల పోలింగ్ మొదలయ్యింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 224 స్థానాలకు 2200 మంది పోటీచేస్తున్నారు. కాగా జయనగర్,ఆర్ఆర్ నగర్ లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.కావున ఇప్పుడు 222 స్థానాలకే ఓటింగ్ జరుగుతోంది. కర్ణాటకలో మొత్తం 4 కోట్ల 96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కర్ణాటకలో అతిపెద్ద నియోజికవర్గం హల్యాల్,అతి చిన్న నియోజికవర్గం దాసరహళ్లి. మొత్తం 58 వేల 546 ఓటరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. విధుల్లో మొత్తం ౩ లక్షల 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు..

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments