పవన్ గ్రామ స్వరాజ్య యాత్ర ఎవరికి నష్టం…

0
360

జనసేన అధినేత పవన్ కళ్యాణ్,ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్. పవన్ మొన్నటి వరకు తెలుగుదేశానికి మద్దత్తు గా ఉండడం,దాని తరువాత ఆవిర్భావ సభలో తెలుగుదేశం ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు చేయడం,దాని తరువాత ప్రభుత్వం తమకు అనుకూలమైన మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం,దానికి పవన్ తన ట్విట్టర్ ద్వారా మీడియా పై మండిపడడం వంటి విషయాలు తెలిసినదే. అయితే అధికార పక్షం పవన్ ను పెద్దగా అంచనావేయలేదు,తాను చేసిన పాదయాత్రను కూడా లైట్ గా తీసుకున్నారు. అయితే అనూహ్యంగా తాము మొత్తం అన్ని స్థానాలలో పోటీ చేస్తామని,త్వరలోనే తాను రాష్ట్ర పర్యటన చేస్తానని పవన్ ప్రకటించడం తో రాజకీయ అలజడి మొదలైంది. ఇప్పుడు పవన్ చేయబోయే యాత్ర పేరు గ్రామ స్వరాజ్య యాత్ర, మొత్తం అన్ని జిల్లాలలోని గ్రామాల్లోనే బస చేస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నమే ఈ యాత్ర. ఓట్ల రద్దు తరువాత గ్రామీణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు,వైద్య సదుపాయం అన్ని చోట్ల లేకపోవడం ఇటువంటి అంశాలు కూడా ప్రజలతో పవన్ చర్చించే అవకాశం ఉంది.

పవన్ తెలుగుదేశం మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రతిపక్ష వైసీపీ కూడా జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది. పవన్ జనంలోకి రావడంతో ఎంత వరకు ప్రభావితం చేయగలరో అని ఆలోచించవలసిన పరిస్తితి. ముఖ్యంగా ఓట్ల చీలిక విషయం లో జనసేన ప్రభావం ఎంత వరకు ఉంటుంది. ముందు ఎన్నికలలో కాపు,కమ్మ సామాజికవర్గాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది.ఈ సారి పవన్ బరిలో ఉండడంతో కాపు సామాజికవర్గంలో చీలిక ఝాయం,కాబట్టి వైసీపీ జాగ్రత్త పడవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల విషయాలకొస్తే పవన్ చేసే మంచిపనుల ప్రభావం మరియు ఆయన యాత్ర ద్వారా భరోసా ఏమి ఇవ్వగలరనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వైసీపీ పవన్ యాత్రను ప్రతి క్షణం గమనిస్తూ తమ ప్రణాళికలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here