కర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అవగాహానా కార్యక్రమాలతో పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. బెంగుళూరు లోని ఒక హోటల్ నిర్వాహకుడు ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్న పద్దతితో ముందుకు వచ్చాడు. నిసర్గ గ్రాండ్ హోటల్ యగామాని కృష్ణ రాజ్ తన వంతు ప్రయత్నంగా ఈ రోజు మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్న యువతకు ఉచిత దోశ మిగతా వారికి ఫిల్టర్ కాఫీ ఫ్రీ గా ఇస్తామని అంటున్నారు. కాని ఇవన్నీ పొందాలంటే వేలు మీద ఉండే సిరా గుర్తును చూపించాలన్నారు. బెంగుళూరు లో నమోదవుతున్న తక్కువ వోటింగ్ శాతాన్ని పెంచడానికి ఇలా చేశానన్నారు. మీరు ఎవరికైనా ఓటు వేయండి మా దగ్గర ఫ్రీ దోశ,ఫిల్టర్ కాఫీ పొందండి అని హోటల్ యజమాని అంటున్నారు.
Subscribe
Login
0 Comments