ఉండవల్లి అరుణ్ కుమార్,రాజముండ్రి మాజీ ఎంపీ రాజకీయాలలో లేనని చెప్తున్నా ఎప్పటికప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉన్నారు. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తాను సుప్రీంకోర్టులో  వేసిన పిటీషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని,ఇంతవరకు కేంద్రం కౌంటర్ దాఖలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు పిటీషన్ దాఖలు చేయడం ద్వారా కేంద్రానికి బుద్ధి చెప్పోచ్చన్నారు తద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇంకా తన పిటీషను కేంద్రం అఫిడవిత్ దాఖలు చేయలేదు అందుకని ఇదే సరైన సమయం అన్నారు. ఇప్పటికే ఆలస్యం చేయడం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని,ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments