సంకేతికతని ఉపయోగించుకోవడంలో తెలంగాణా పోలీసు వ్యవస్థ ఒక అడుగు ముందు ఉంది. పోలీసు వ్యవస్థను సమన్వయ పరిచేందుకు ఒక అప్లికేషను రూపొందుతోంది దాని పేరు “కాప్ కనెక్ట్” . ఈ అప్ ద్వారా ఫోటోలు,వీడియోలు షేర్ చేసుకోవచ్చు.దీంట్లో ఆసక్తికర విషయమేమిటంటే ఒకేసారి లక్షమందికి సమాచారం పంపుకోవచ్చు. వాట్సాప్ లో కేవలం 256 మాత్రమే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, కాబట్టి చాలా గ్రూపులు పెట్టుకొని పోలీసులు సమాచారాన్ని పంపుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆప్ ద్వారా ఆ సమస్య తొలగిపోతుంది,ఇందులో మొత్తం తెలంగాణ రాష్త్రంలోని 60 వేల మంది పోలీసులను ఆడ్ చేయనున్నారు. తద్వారా ఏదైనా సమాచారం క్షణాల్లో మొత్తం పోలీసు యంత్రాంగానికి చేరుతుంది,తద్వారా పని తీరు మెరుగుపడుతుందని పోలీసులు ఆశిస్తున్నారు. ఇందులో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ అప్లికేషను లో షేర్ చేసుకున్న సమాచారం వేరే వారికి పంపే వీలు ఉండదు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments