జియో దెబ్బకు ఢమాల్‌…

753

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొత్త పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్‌, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌లు ఒక్కసారిగా కుదేలయ్యారి. శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐడియా షేర్లు 8.1 శాతం మేర క్షీణించాయి. ఇది 2011 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలు. అదేవిధంగా ఎయిర్‌టెల్‌ షేర్లు కూడా 5.8 శాతం కిందకి పడిపోయాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఈ టెలికాం కంపెనీలను, ఎప్పడికప్పుడూ జియో దెబ్బతీస్తూనే ఉంది. ప్రస్తుతం జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌కు కౌంటర్‌గా తాము ఎలాంటి ప్లాన్‌లను ప్రకటించాలని కంపెనీలు యోచిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here