బాహుబలి – 2 తరువాత జక్కన చాలా టైం గ్యాప్ తీసుకున్నారు. తన తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్,రామచరణ్ కాంబినేషన్ లో ఉండనుందని ప్రకటించిన విషయం తెలిసినదే. ప్రస్తుతం కధకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ప్రకటించినప్పటినుంచి ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పటి నుంచి మొదలవుతుందని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా పేరు,బడ్జెట్ గురుంచి వివరాలు వెలువడలేదు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కి “ఇద్దరూ ఇద్దరే” పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లో ఇద్దరి హీరోల పాత్రలు ఒకదానికి ఒకటి పోటీపడుతూ సమాంతరంగా ఉండనున్నాయని,అందుకే ఈ పేరు కరెక్ట్ అని భావిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ఆగష్టు లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments