ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. ఆ వ్యక్తి గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధ లేకపోతే హాస్యం రాదని, అందుకనే, రవితేజ అంటే తనకు ఇష్టమని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. నేలటిక్కెట్టు చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. రవితేజ నటుడిగా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది. ఆ కృషిని అభినందిస్తున్నా. ఎంతమంది మధ్యలోనైనా సరే, రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే, రవితేజ నాకు స్ఫూర్తి’ అని ప్రశంసించారు.

రవితేజను ఫస్ట్ టైమ్ అప్పుడు చూశా

‘నేను సినిమాల్లోకి రానప్పుడు.. వీధుల్లో తిరుగుతున్నప్పుడు అప్పటికే నటుడిగా ఉన్న రవితేజను చూశాను. అన్నయ్య చిరంజీవి తర్వాత ఓ నటుడిగా అంత దగ్గరగా రవితేజను మద్రాసులో చూసేవాడిని. ‘ఆజ్ కా గూండా రాజ్’ సినిమా విడుదలైనప్పుడు మద్రాసులో ఈ సినిమాను చూసేందుకు వెళ్లా. అప్పుడు, రవితేజను ఫస్ట్ టైమ్ చూశాను. అప్పటికి నేను నటుడిని కాదు కనుక నన్ను రవితేజ గుర్తించలేదు. రవితేజ అప్పటికే నటుడు కనుక నేను గుర్తించా’ అని పవన్ అనడంతో రవితేజ నవ్వులు చిందించాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments