న్యాచురల్ స్టార్ నాని,ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి విజయపధంలో దూసుకుపోతున్నారు. మహానటి వంటి దృశ్యకావ్యం తీసి మంచి హిట్ ను సంపాదించుకున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 2015 సంవత్సరంలో ఎవడే సుబ్రహ్మణ్యం విడుదలై మంచి విజయాన్ని సాదించింది. దాని తరువాత నాని ఇతర చిత్రాలలో బిజీ అయిపోయారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎవడె సుబ్రహ్మణ్యం సీక్వెల్ చిత్రీకరించబోతున్నారని,మొదటి సినిమాలో ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే కొనసాగేలా నాగ్ అశ్విన్ కధను సిద్ధం చేస్తునట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.