మరి కొద్ది గంటల్లో కర్ణాటక ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ నగర్ నియోగికవర్గం లో ఎన్నికలను వాయిదా వేసింది. కొన్ని రోజుల క్రితం బెంగుళూరు నగరంలోని ఒక ఫ్లాట్ లో 9,476 ఓటర్ ఐడీ కార్డులు పట్టుబడిన విషయం తెలిసినదే.ఈ ఘటనలో సిట్టింగ్ ఎంఎల్ఏ మునిస్వామి తో పాటు 14 మందిపై కేసు నమోదైంది. దీని పై బీజేపీ,కాంగ్రెస్ తీవ్ర విమర్శలకు దిగాయి. దీని పై ఇరు పార్టీల ప్రతినిధులు ఎన్నికల కమీషన్ కలిసి ఎన్నికలను వాయిదా వేయవలసినదిగా కోరాయి. దీని పై ఎన్నికల కమీషన్ స్పందించి ఆర్ఆర్ నగర్ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నెల 28 న పోలింగ్ నిర్వహించి,31 న కౌంటింగ్ చేయనున్నారు.
కర్ణాటక లో ఈ ఒక్క చోట ఎన్నికలు వాయిదా…
Subscribe
Login
0 Comments