రవితేజ నేలటిక్కెట్ ఆడియో విడుదల కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగినది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ తనకు దర్శకుడిగా జన్మనిచ్చింది రవితేజ అని,ఆ జన్మకు పరమార్ధం తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని,గబ్బర్ సింగ్ తరువాత తన స్థాయి మారిపోయిందన్నారు.

సరిగ్గా ఆరేళ్ళ క్రితం నా జీవితం మారిపోయిన సంఘటన జరిగిందని హరీష్ అన్నారు. మే 11,2012 అదే రోజు గబ్బర్ సింగ్ విడుదలై అఖండ విజయం సాదించింది. ఆరోజుతో తన జీవితం మారిపొయిందన్నారు. తాను పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లు కూడా ఫాలో అవుతుంటానని హరీష్ తెలిపారు. మీ హీరోకు రాజకీయాలు ఎందుకు అని ఎవరు అడిగినా సమాధానం చెప్పలేదు. కానీ ఇటీవల విజయవాడలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తున్న వీడియో చూసా. చెమటలు కక్కుతూ ఎండలో ఆయన నడుస్తుంటే ఓ విషయం అనిపించింది. కోట్లాది రూపాయల సంపాదన, సినిమా ఆలు వదిలేసి ఇది పవన్ కళ్యాణ్ గారికి అవసరమా అని అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన సిద్ధాంతాలు తనకు తెలుసు అని ఆయన విజయం సాధించాలని హరీష్ శంకర్ ఆకాంక్షించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments