టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీకర్ జూన్ 2 తరువాత ఆమోదించే అవకాశం ఉందని,తనకున్న సమాచారం ప్రకారం స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తారని,రాస్త్రంలో 5 స్థానాలలో ఉపఎన్నికలు ఖాయమని అన్నారు, ఉపఎన్నికల ఎప్పుడు వచ్చినా తమ తడాఖా చూపి గెలుస్తామని అన్నారు. గతంలో తెలంగాణాలో 25 స్థానాలకు పోటీ వస్తే తాము 7 స్థానాలు గెలుచుకున్నామని గుర్తు చేసారు. వైసీపీ,బీజేపీ కలిసి రాష్త్రంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని,కర్ణాటకలో ఎన్జేఒ నేత అశోక్ బాబు పై దాడి వైసీపీ కుట్రేనన్నారు. ఇసుక అక్రమ రవాణా,బెల్ట్ షాపుల విషయంలో అక్కడి ఎంఎల్ఏ,ఎంపీ,మంత్రులదే భాద్యతన్నారు. ఇసుక ఆక్రమణ రవాణా ఎక్కడ జరుగుతున్నా మంత్రులు చొరవ తీసుకొని బాధ్యత వహించాలన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని,ఎక్కడ తిరిగి ప్రారంభించినా నేతలే దగ్గరుండి తొలగించాలని అన్నారు.
వైసిపీ ఎంపీల రాజీనామాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు…
Subscribe
Login
0 Comments