పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాపికొండలు యాత్రలో ఉన్న ఓ బోటులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బోటులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విహారయాత్రకు వినియోగించిన బోటు పాతది కావడం వల్ల ఇంజన్ హీట్ ఎక్కి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో బోటులో 80 మంది పర్యాటకులు ఉన్నారు. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద ఘటనతో పర్యాటకులను దించేసిన నిర్వాహకులు వేరొక బోటులో తరలించారు.
Subscribe
Login
0 Comments