బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు తిరుమలకు వెళ్ళారు. స్వామీ దర్సనానంతరం తిరుగు ప్రయాణంలో ఆయన వెళుతున్న కాన్వాయ్ పై తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు రువ్వారు. దీనితో కార్ల అద్దాలు పగిలాయి. అమిత్ షా కు వ్యతిరేఖంగా తెలుగుదేశం కార్యకర్తలు,నినాదాలతో హోరాతిస్తూ రోడ్డుపై అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసారని,మళ్ళీ తమను విమర్శిస్తున్నారని,ఇది సరైన పధ్ధతి కాదని తెలుగుదేశం శ్రేణులు వాపోయారు.దీనితో బీజేపీ శ్రేణులకు,తెలుగుదేశం కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకొని పటిష్ట భద్రత మధ్యత మధ్య అమిత్ షా ను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్ళారు.
Subscribe
Login
0 Comments