సెల్ఫీ ట్రెండ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ మరో సరికొత్త ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. రెడ్‌మి ఎస్‌2 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌.. 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అంతేకాదు, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ఫ్రంట్‌ కెమెరాతో చక్కని పోట్రెయిట్‌ మోడ్‌తో చక్కని ఫొటోలు తీసుకోవచ్చని షియోమీ తెలిపింది.

గురువారం జరిగిన లాంచ్‌ ఈవెంట్‌లో ఫోన్‌ ధరతో పాటు, ప్రత్యేకతలను అధికారికంగా వెల్లడించారు. 3జీబీ ర్యామ్‌ 32జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌ ధర సుమారు రూ.10,600 కాగా, 4జీ ర్యామ్‌ 64జీబీ ర్యామ్‌ కలిగిన మొబైల్‌ ధర సుమారు రూ.13,700గా నిర్ణయించారు. గోల్డ్‌, ప్లాటినం, రోజ్‌గోల్డ్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మి 2ఎస్‌ ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.* 5.99 (18:9)హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
3జీబీ/4జీబీ ర్యామ్‌తో పాటు, 32జీబీ/64జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం
12+5 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా విత్‌ సాఫ్ట్ ఫ్లాష్‌
డ్యుయల్‌ సిమ్‌ సదుపాయంతో పాటు, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే సదుపాయం
ఆండ్రాయిడ్‌ 8.1
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments