హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా ‘పడి పడి లేచె మనసు’ సినిమా రూపొందుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, కొన్ని రోజులుగా కోల్ కతాలో చిత్రీకరిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, రేపటి నుంచి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ను ఆరంభించనున్నారు.

శర్వానంద్ .. సాయిపల్లవి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందనీ, ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments