రచయిత సాయిమాధవ్ బుర్రా పేరు వినగానే “సమయం లేదు మిత్రమా రణమా .. శరణమా” అనే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలోని డైలాగ్ గుర్తొస్తుంది. తాజాగా వచ్చిన ‘మహానటి’కి .. సెట్స్ పై వున్న ‘సైరా’కి సంభాషణలు అందించింది ఆయనే. అలాంటి సాయిమాధవ్ బుర్రా తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు.

” చిత్రపరిశ్రమకి నేను వచ్చి చాలా కాలమే అయింది. అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు వున్నాయి. అయినా నేను ఎప్పుడూ వెనక్కి వెళ్లిపోవాలని అనుకోలేదు. ఎందుకంటే రాయడం తప్ప నాకేమీ తెలియదు .. నటన వచ్చు కాబట్టి అది చేయగలనేమో .. అంతకి మించి ఏమీ తెలియదు. అవకాశాలు అందిపుచ్చుకోవడం చాతకావడం లేదని నన్ను నేను తిట్టుకునేవాడినిగానీ .. ఇండస్ట్రీని ఎప్పుడూ తిట్టుకోలేదు. మొహమాటమో .. సిగ్గో చెప్పలేను గానీ .. ఎవరినీ అవకాశాలు అడిగేవాడిని కాదు” అంటూ చెప్పుకొచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments