వైబ్రంట్స్ అఫ్ కలాం సంస్థ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం నందు ఈరోజు దేశం లోనే అతి పెద్ద జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జూలై 22 1947 లో నెహ్రు గారు ప్రవేశ పెట్టారని. ఆ సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ కాషాయం అనేది హిందూ మతానికి సంబంధించి కాదని,ఎవరైతే స్వలాభం వదిలేసి దేశసేవ చేస్తారో వారికి అంకితం అని తెలిపారన్నారు. అదే సమయములో ముస్లిం లీగ్ నాయకులు ఆకుపచ్చ,కాషాయ రంగులు దేశంకోసం నిస్స్వార్ధంగా సేవ చేసే సర్వ సంఘ పరిత్యాగులకు నిదర్శనం అని తెలిపారన్నారు. అదే విధంగా పవన్ మాట్లాడుతూ జెండా లోని కాషాయం,ఆకుపచ్చ,తెలుపు రంగులు జాతి సమగ్రతకి,జాతీయ సమైఖ్యతకి నిదర్శనంగ అని అన్నారు.

జాతీయ పతాకాన్ని చూస్తున్నప్పుడు సముద్రం ఒక కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు,పర్వతం ఒకరికి ఒంగి సలాం చేయదు అన్న భావన తనకు వస్తుందని. యువత రాజకీయాలోకి రావాలని, మనం పిడికెడు మాట్టే కావొచ్చు కాని ఒకసారి తలే ఎత్తి జెండాను చూస్తే ఉవ్వెత్తున ఎగిసే గుండె ధైర్యం కలుగుతుందన్నారు.దేశభక్తి ప్రతిజ్ఞ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మరచిపోతున్నారని,అక్కడ ఉన్న ప్రజలతో దేశభక్తి ప్రతిజ్ఞ చేయించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments