అల్లు అర్జున్,వక్కంతం వంశీ కాంబినేషన్ లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా విడుదలై మంచి హిట్‌ను అందుకున్న విషయం తెలిసినదే. అయితే మూవీ టీం థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రేక్షకులలాగా తనకు కూడా ఈ సినిమా చూడాలనుందని,నిర్మాత లగడపాటి శ్రీధర్ గారిని అడిగి పర్యటనకు ముందే చూడాలనుకుంటున్నానన్నారు. వక్కంతం వంశీ తనకు రచయతగా బాగా తెలుసని,కొమరం పులి చిత్రీకరణ సమయంలో మంచి కథ వినిపించినా అది జరగలేదన్నారు. ఇక్కడకి వచ్చే వరకు మా అన్నయ్య ఒక నిర్మాత అని తెలియదని పవన్ అన్నారు. అల్లు అర్జున్ అంటే తనకెంతో ఇష్టమని,తన మొదటి సినిమా,ఆర్య నుండి తన ఎదుగుదల చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని,ఇలాగే ఇంకా ఎదుగుతూ తల్లి తండ్రుల పేరు,అల్లు రామలింగయ్యగారి పేరు నిలబెట్టాలన్నారు.
Subscribe
Login
0 Comments