రానున్న ఎన్నికలు ఎలా ఉండనున్నాయి…

0
389

2019 ఎన్నికలు సర్వత్రా జరుగుతున్న చర్చ. ఎవరు గెలుస్తారనేది అంతుపట్టని పరిస్థితి. మొన్నటి వరకు కేవడం తెలుగుదేశం,వైసీపీ మాత్రమె బరిలో ఉండడం వాళ్ళ కొంత వరకు గెలుపు ఎవరిదనేది నిర్ధారణకు వచ్చే అంశం. కాని ఇప్పుడు జనసేన కూడా మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించడంతో అందరూ సందిగ్ధం లో పడ్డారు. జనసేన పార్టీ వాళ్ళ ఎవరికీ ఎంత లాభం,గెలుపు ఎవరికీ అనుకూలిస్తుంది అన్న విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. ఇక అధికార,ప్రతిపక్షాలపై ఉన్న అవినీతి కేసులు రానున్న ఎన్నికలలో ప్రభావితం చూపే అవకాశం ఉంది.

ప్రత్యేక హోదా అంశం కూడా ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు మొదట ప్రత్యేక హోదా కావాలి,తరువాత కేంద్రం ప్రకటించిన పాకేజీ చాల బాగుందని,అది కూడా దక్కక పోవడం తో మళ్ళీ ప్రత్యేక హోదా వంటి వేర్వేరు ప్రకటనలతో ప్రతిపక్షాలకు  విమర్శించదానికి అనుకూలించిన అంశం. ఉద్యోగ కల్పనా లేకపోవడం,పోలవరం పూర్తి కాకపోవడం వంటివి కూడా ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశం

ఉత్తరాంధ్ర లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం  జిల్లాలో పోయిన ఎన్నికలలో తెలుగుదేశం అధిక స్థానాలు సాధించింది. అక్కడ వెనక బడిన వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత జగన్ ప్రజసంకల్ప యాత్ర లో భాగంగా తాము అధికారం లోకి వస్తే వెనకబడిన వర్గాలకు మేలు కలిగించే పధకాలు ప్రవేశ పెడతామని ప్రకటించారు. ఈ ప్రకటనలతో ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు పవన్ కూడా బస్సు యాత్ర ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నేలకోనింది. ఇప్పటివరకు క్యాడర్ కాని అభ్యర్ధిని కాని నిర్ణయించని జనసేన ఏ మాత్రం ప్రభావం ఉంటుందనేది చూడాలి.

ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే అక్కడ కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక్కడ వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేక పోవచ్చు. సామాన్యంగా ఎన్నికలలో కులం ఎక్కువ ప్రభావితం చూపుతుంది. జనసేన కు ఇది కొంతవరకు కలిసి వచ్చే అంశం . కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ప్రజలు పవన్  వైపు మొగ్గే అవకాశం ఉంది . ఇక్కడ కాపు రిజర్వేషన్ అంశం కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంది . కాపు రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించినా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇది తమకు ఆనందాన్ని కలిగించలేదని పేర్కొన్నారు. కాని చివరి క్షణం వరకు ఏ విధంగా రాజకీయ సమీకరణాలు మారతాయి అనేది ఊహించలేని విషయం.

ఇక కృష్ణ,గుంటూరు జిల్లాల విషయానికి వస్తే కచ్చితంగా ఇది తెలుగుదేశానికి కలిసి వచ్చే అంశం . కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి పార్టీ లో కూడా ఎక్కువగా ఉన్నది కమ్మ అబ్యార్దులే కాబట్టి వారే గెలిచే అవకాశం ఉంది . కాకపోతే ఇప్పుడు జగన్ ప్రజసంకల్ప యాత్ర లో భాగంగా నిమ్మకూరు లో తాము అధికారంలోకి రాగాన కృష్ణా జిల్లా పేరును నందమూరి తారక రామారావు జిల్ల్లాగా మారుస్తామని చెప్పడం పెను దుమారం లేపింది. తమ పార్టీ నేతే దాన్ని వ్యతిరేకించడం,మాట వెనక్కి తీసుకోకుంటే రాజీనామా చేస్తాననడం అందరిని ఆశ్చర్యానికిలోనయ్యేలా చేసింది. ఇక జనసేన విషయానికి వస్తే పవన్ తన బస్సు యాత్ర ద్వారా ఎంతవరకు తన అభిమానులు ప్రభావితం చేయగలరో చూడాలి.

ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజికవర్గాలు ఉండగా అందులో మునుపటి ఎన్నికలలో తెలుగుదేశం 10 స్థానాలను కైవసం చేసుకుంది . వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యింది. కానీ ఈ సారి జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏమాత్రం ప్రభావం చూపగాలరో చూడాలి. అలాగే జనసేన యాత్ర ద్వారా పవన్ ఏ స్ట్రాటజీ తో వెలతారనేదానిపై ఆధారపది ఉంటుంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ శాతం వైసిపీ సాధించింది. పైగా రెడ్డి సామాజిక వర్గం కూడా ఇక్కడ ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆనం కుటుంబం ఉండడంతో దాదాపు గెలిచే అవకాశాలు ఎక్కువ.

రాయలసీమ విషయానికి వస్తే ఒక్క అనంతపురం తప్ప మిగతా జిల్లాల్లో వైసిపీ బలం ఎక్కువగా కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది . వై ఎస్ జగన్ రాయలసీమ కావడం అక్కడ తమ క్యాడర్ గట్టిగా నెలకొల్పుకోవడం లో జగన్ విజయం సాధించారని చెప్పుకోవడం లో ఎటువంటి సందేహం లేదు . ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరు లో కూడా వైసీపీ ఆధిక్యాన్ని సాదించింది. ఇక జనసేన విషయానికొస్తే తాను అనంతపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. నిజంగా పోటీ చేస్తే ఎంతవరకు విజయం సాధించగలరో చూడాలి. పైగా ఇప్పుడు పవన్ తెలుగుదేశం పై విమర్శలు చేయడంతో వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయి.

జనసేన ఎన్నిలకలోకి అడుగుపెట్టడంతో అధికార,ప్రతిపక్షాలు ఎవరికీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేదానిపై చర్చించుకుంటున్నాయి. ఇందులో మీడియా పాత్ర కూడా ప్రభావితం చేస్తుంది. అధికార పక్ష మీడియా ఛానళ్లు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తద్వారా తనపై కుట్ర జరపడానికి యత్నిస్తున్నాయి జనసేన అధినేత తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా చెప్పడం,కాబట్టి ఆ నాలుగు మీడియా సంస్థలను బహిష్కరించాలని అభిమానులకు పిలుపునివ్వడం వలన జనసేన కు మీడియా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాని తన యాత్ర ద్వారా ప్రజలకు ఏ మాత్రం ప్రజలకు భరోసా ఇవ్వగలరో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here