ఆంధ్ర ప్రదేశ్ రవాణా రంగంలో మరొక అడుగు ముందుకు వేయబోతోంది. కర్నూల్ జిల్లాలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ లో ఓర్వకల్లు లో విమానాశ్రయం ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
Subscribe
Login
0 Comments