మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన చిత్రం భరత్ అనే నేను . ఈ చిత్రం ఈ నెల 20 న విడుదలై కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమాలో చూపించిన నవోదయం పార్టీ మరియు గుర్తు తమదేనని నవోదం పార్టీ అధ్యక్షుడు దాసరి రాము ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి ఎన్నికల గుర్తింపు కూడా ఉందని,అలాంటిది పార్టీ పేరు, గుర్తు చిత్రంలో ఎలా ఉపయోగించారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దర్శక, నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్టు దాసరి రాము పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments