మహేశ్ బాబుతో తన తదుపరి సినిమా వుండనున్నట్టు సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే విషయాన్ని ఆయన స్థానిక విలేకరులతోను .. గ్రామస్థులతోను చెప్పారు. తన తండ్రి వార్షిక కార్యక్రమానికి స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా ‘మట్టపర్రు’ వెళ్లిన ఆయనను కలవడానికి గ్రామస్థులు పెద్దసంఖ్యలో వచ్చారు.

వాళ్లందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన, ‘రంగస్థలం’ సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయన సాధించిన విజయం పట్ల గ్రామస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే .. మహేశ్ బాబు సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళుతున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందనీ .. ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతాడని అన్నారు. అభిమానులందరితోను ఫొటోలు దిగుతూ ఆయన చాలాసేపు గడిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here