జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తామని త్వరలో తాను బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళతానని ప్రకటించారు. ఇప్పుడు పవన్ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యినట్టు సమాచారం వెలువడుతోంది. ఈ నెల 15 నుండి పవన్ బస్సు యాత్ర చేపడుతున్నారని, శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు పవన్ యాత్ర ఉండబోతుందని సమాచారం. కాగా ఎక్కడ నుండి మొదలుపెదతారనేది ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఉత్తరాంధ్ర నుండి మొదలుపెడతారా లేదా అనంతపురం నుండి మొదలుపెదతారా అనే విషయం మీద భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయ్. ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉత్తరాంధ్ర లో కొనసాగడం వల్ల,రాయలసీమ జిల్లాలు పర్యటించి కొంత సమయం అయ్యింది కాబట్టి పవన్ మొదట అనంతపురం మీద దృష్టి పెడతారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ యాత్ర ద్వారా తమ పార్టీ విధి విధానాలు,క్యాడర్ ను బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు.అలాగే ప్రజల సమస్యల మీద అవగాహన పెంచుకునే ఉద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నారు. అయితే ఈ పర్యటన పై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.