పవన్ పోటీ ఇక్కడి నుంచే…

0
822

పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే కృష్ణ జిల్లా జనసేన ఇంచార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు పవన్ పోటీ విషయమై సంచలన విషయాలు వెల్లడించారు. పవన్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి రానున్న ఎన్నికలలో పోటీ చేయబోతున్నారని తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.అయితే తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ఇదివరకే ప్రకటించగా,తిరుపతి నుంచి అని కొన్ని ఊహాగానాలు ఉన్నాయ్. కాని ఈ విషయమై జనసేన నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here