జనసేన అధినేత ఇటీవల తాము మొత్తం 175 స్థానాలలో పోటీచేస్తామని త్వరలో రాష్ట్ర పర్యటన ఉంటుందని తెలిపారు. దాని తరువాత పవన్ బస్సు యాత్ర చేపట్టబోతునట్టు,మే 15 నుండి శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు యాత్ర ఉంటుందన్న విషయం తెలిసినదే. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. పవన్ బస్సు యాత్రకు “గ్రామ స్వరాజ్య యాత్ర” గా నామకరణం చేశారన్నది సారాంశం. అయితే ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.