వంద కోట్ల క్లబ్ లోకి సూర్య…

0
488

దర్శకుడిగా పరిచయమవుతూ వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య’ సినిమాను తెరకెక్కించారు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ కి గల క్రేజ్ కారణంగా తొలిరోజునే ఈ సినిమా 38 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లను రాబట్టింది.

ఇక మిగతా మూడు రోజులకు కలుపుకుని ఈ సినిమా మరో 50 కోట్లు కొల్లగొట్టేసింది. ఇలా తొలి 5 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఒక వైపున ‘రంగస్థలం’ .. మరో వైపున ‘భరత్ అనే నేను’ భారీ విజయాలను అందుకుని ఇంకా కొనసాగుతూ ఉండటం ‘నా పేరు సూర్య’ వసూళ్లపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపున ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశపరిచే విషయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here