మహానటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ముందుకు రావడమే కాదు… ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్లింది. సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. చిత్రబృంధానికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ…మహానటి అద్వితీయ చిత్రమని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా ఓ క్లాసిక్‌లా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ‘మహానటి’ నటీనటులందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రిమిది. ఈ సినిమా తీసిన నిర్మాతల నమ్మకం నిజమైంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మరొకసారి రుజువైంది.

ఈ చిత్రంపై స్పందిస్తూ… ‘అశ్వనిదత్‌ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక సావిత్రి జీవితచరిత్రను సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి శభాష్‌ అనిపించుకునేలా చేశారు. ది క్రెడిట్‌ గోస్‌ టూ ది డైరెక్టర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌. ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ప్రసాదించాలనీ, ఆయురారోగ్యాలతో ఉండాలని ఇటువంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని ఆ బిడ్డలను ఆశ్వీరాదిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments