రాయలసీమ నేపధ్యంలో మహేష్ 25…

624

భరత్ అనే నేను భారి విజయం తరువాత మహేష్ తన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్సకత్వంలో చేయనున్నారు. ఈ కధకు సంబంధించి అమెరికాలో లొకేషన్స్ కోసం తిరుగుతునట్టు వంశీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ కధ ప్రకారం చాలా వరకు అమెరికాలోనే షూటింగ్ జరుగుతుందని చెప్పారు. దాంతో అమెరికా నేపథ్యంలోనే ఈ కథను సిద్ధం చేశారని మహేశ్ బాబు అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. ఈ తరహా కథను మహేశ్ ఇంతరవరకూ టచ్ చేయలేదని చెబుతున్నారు. తాజాగా బయటికి వచ్చిన ఈ విషయం .. మహేశ్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచడం ఖాయమని చెప్పొచ్చు. పూజా హెగ్డే ఈ సినిమాలో మహేశ్ జోడీ కడుతుందనే విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here