విజయ్ దేవరకొండ,అర్జున్ రెడ్డి సినిమా ద్వారా పెద్ద స్టార్ అయిపోయారు. ఈరోజు ఆయన పుట్టినరోజు.బర్త్‌డే బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. మండే ఎండల్లో చల్లని ఐస్‌క్రీమ్స్‌ పంచేందుకు ట్రక్కులు ఏర్పాటు చేసి వినూత్నంగా తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అర్జున్‌ రెడ్డి సినిమాతో స్టార్‌గా మారిన విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించారు. నాలుగేళ్ల క్రితం సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అయితే ప్రస్తుతం తనకు ప్రత్యేకంగా ఆఫీసు, వ్యవహారాలు చూసుకునేందుకు టీమ్‌ ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

అర్జున్ రెడ్డి సీక్వెల్ గురుంచి అడగగా అర్జున్ రెడ్డి సీక్వెల్ చేసే అవకాసం ఉందన్నారు. ఆనందంగా ఉన్న 40 ఏళ్ల వ్యక్తిగా అర్జున్‌ రెడ్డిని చూపించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అర్జున్‌ రెడ్డికి ఓ కూతురు ఉండాలని, ఆమె ప్రేమలో పడితే అప్పుడు అతడి భావోద్వేగాలు ఏవిధంగా ఉంటాయో సీక్వెల్‌లో చూపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాలిస్తే తప్పకుండా అర్జున్ రెడ్డి సీక్వెల్ ఉంటుందన్నారు.

మహానటిలో పాత్ర గురుంచి అడగగా నాగ్ అశ్విన్ అడగగానే చేసేనానని,చిన్న పాత్రే అయినా తనకెంతో ప్రత్యేకమని అన్నారు. విజయ్‌ తాజా సినిమా ‘టా​క్సీవాలా’ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments