ఓటుకు నోటు కేసు 2015 లో సంచలనం సృష్టించింది. ఎమేల్సీ ఎన్నికలప్పుడు టీడీపే టీఆర్ఎస్ ఎమేల్సీ లను కొనాలని చూసారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ అయిన స్టీఫెన్సన్ కు 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇస్తూ దొరికిన వీడియో కూడా వెలువడింది. అదే కాకుండా చంద్రబాబు స్వయంగా స్టీఫెన్సన్ తో మాట్లాడిన ఆడియో టేప్ కూడా వెలువడడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ తరువాత రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం,బెయిల్ పై తిరిగి రావడం అంతా తెలిసినదే. ఇప్పుడు ఈ కేసు సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉంది
చాల రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో రెండు గంటల పాటు పోలీసు ఉన్నతాదికారులతో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. ఆడియో టేపు ఫోరెంసిక్ రిపోర్ట్ పై కూడా ఆరాతీశారు. కేసు పురోగతి,అసలు నిందితుల తదితర అంశాలు చర్చించారు. కొన్ని వర్గాల ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్షల తరువాత ఆ ఆడియో టేప్ లో ఉన్న గొంతు చంద్రబాబుదేనని తెలుస్తోంది, చంద్రబాబును ఎ-1 నిందితుడిగా కేసులో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే చంద్రబాబు రాజకీయంగా చాలా నష్ట పోవలసి ఉంటుంది.
ఇప్పటికే రాష్ట్రం లో ఉన్న పరిస్థితుల రీత్యా ప్రభుత్వం అనేక విమర్శలను ఎదురుకుంటోంది. చిన్న విషయం దొరికితే దాన్ని అదునుగా చేసుకొని అధికారపక్షం పై ప్రతిపక్షం విరుచుకుపడుతోంది. ఇప్పటిదాకా రాజధాని విషయంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం,పోలవరం పూర్తి అవ్వకపోవడం,ఎటువంటి ఉద్యోగాలు యువతకు కల్పించకపోవడం వంటివి అధికారపక్షం పై విమర్శలకు దారి తీస్తున్నాయి. మొన్నటి వరకు తమతో ఉన్న పవన్ కూడా వ్యతిరేకించడం తో చంద్రబాబు కు పెద్ద దెబ్బ తగిలింది.
చంద్రబాబు కొడుకుగా లోకేష్ ప్రభుత్వ పరంగా పెద్దగా అవగాహన కల్పించుకోకపోవడం,నలుగురిలో తన మాటలతో ఆబాసుపాలవ్వడం చూస్తున్నాం. అలాగే ఇతర మంత్రి వర్గం లోని వారు కూడా అనేక కేసులలో కూరుకుపోవడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా తయారయ్యాయి.
ఒకవేళ ఓటుకు నోటు కేసు పురోగతి చెంది చంద్రబాబే నిందితుడిగా రుజువైతే కచ్చితంగా జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. అలా జరిగినట్ట్టైతే తన రాజకీయ జీవితానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇంకొక సంవత్సరం లో ఎన్నికలు జరగబోతున్నాయి,ఇటువంటి సమయంలో ఈ విషయమై ప్రతిపక్షం ఒక ఆయుధంగా చేసుకొని ప్రజల్లో వ్యతిరేఖంగా ప్రచారం చేసే అవకాశంలేకపోలేదు. కేసీఆర్ ఈ విషయమై నిందితులు ఎవరైనా ఒదిలే ప్రసక్తే లేదని ప్రకటించారు. చంద్రబాబే నిందితుడని రుజువైతే తెలుగుదేశం మనుగడ కష్టం అవుతుంది. ఏదైనా కూడా చంద్రబాబు ఈ కేసు పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.