రామచరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్సకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా నటిస్తున్న చిత్రం సైరా. నయనతార ఇందులో కధానాయికగా నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ఇప్పటికే ప్రధాన పాత్రలకు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ కూడా చాల సమయం పడుతుంది. అందువలన ఆ పనులు కూడా వేగంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం మే 9 వ తారేఖున విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజున “జగదేక వీరుడు అతిలోక సుందరి” మరియు “గ్యాంగ్ లీడర్” విడుదలై హిట్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ తేదీ నిర్ణయించారని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments