వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్లపై రద్దీని తగ్గించి.. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. లింగంపల్లి-కాకినాడ, విశాఖపట్నం మధ్య మొత్తం 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో 14 సర్వీసులు లింగంపల్లి-కాకినాడల మధ్య ప్రతి ఆదివారం రైళ్లను వేశారు. లింగంపల్లి నుంచి విశాఖపట్నంల మధ్య 16 రైళ్లు నడుపుతున్నారు. లింగంపల్లి నుంచి ప్రతి శుక్రవారం ఈ రైళ్లు బయలుదేరుతుండగా.. విళాఖపట్నం నుంచి ప్రతి శనివారం తిరుగు ప్రయాణం అవుతున్నాయి. కాజిపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా ఇవి నడుస్తాయి. కాకినాడ టౌన్‌కు (07075) మే 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో ఉదయం 4.55 గంటలకు బయలుదేరుతుంది. కాకినాడ టౌన్ నుంచి 07076 నంబరుతో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.45కు లింగంపల్లికి చేరుతుంది. లింగంపల్లి – విశాఖపట్నంల మధ్య నడిచే రైళ్లు కాజిపేట, వరంగల్, ఖమ్మం టౌన్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్ల మీదుగా వెళతాయి. లింగంపల్లి నుంచి విశాఖపట్నంకు (07148) మే11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నంకు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి (07147) మే 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ఉదయం 10.15కు బయలుదేరి రాత్రి 11.10కి లింగంపల్లికి చేరుకుంటుంది.
Subscribe
Login
0 Comments