
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పై ధ్వజమెత్తారు. 2019 లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే తానే దేశ ప్రధాని అన్నారు.జీఎస్టీ,నోట్ల రద్దు వాళ్ళ ప్రజలకు మేలుజరగలేదు గాని,నష్టాన్ని కలిగించిందన్నారు. అవినీతి పరుడైన యద్యూరప్పను ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారో మోడీ చెప్పాలన్నారు. 35 వేల కోట్లు దోచుకున్న గాలి వర్గానికిక ఎందుకు 8 సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు కలిపిస్తానని మాట ఇచ్చి ఎందుకు తప్పారో మోడీ యువతకు సమాధానం చెప్పాలనారు.