స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం విడుదలై సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ లెవల్‌లో చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. పవర్‌స్టార్, స్టైలిష్‌స్టార్ ఒకే వేదికపైకి వస్తుండడంతో ఫంక్షన్‌ను భారీస్థాయిలో చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈనెల 10వ తేదీన ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం మనమందరం గర్వపడే చిత్రం. చూసిన ప్రతి ప్రేక్షకుడు దేశభక్తితో ఉప్పొంగిపోయే చిత్రం. మా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ ఈ సినిమాకు ప్రధాన బలం. వక్కంతం వంశీ దర్శకుడిగా తన స్టామినా చూపించి సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులంతా ముక్తకంఠంతో భారీ కలెక్షన్స్ దిశగా తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేశాం. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. బన్నీ అంటే అమితంగా ఇష్టపడే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ ఒకే వేదిక మీదకు వస్తే అభిమానుల్లో ఉత్సాహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం..’’ అని అన్నారు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments