కీర్తి సురేష్,నేను శైలజ,నేను లోకల్,అజ్ఞాతవాసి వంటి సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అలానటి అందాల తార సావిత్రి బయోపిక్ “మహానటి” లో సావిత్రి పాత్ర పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్,ట్రైలర్స్ లో ఆమె అచ్చు సావిత్రి లాగే కనిపించారు. దానితో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రం ఈ నెల 9 వ తారేఖున విడుదల కానుంది
అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ మరో బయోపిక్ లో నటించానున్నారు. అది ఎవరిదో కాదు పురచ్చి తలైవి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. సినీరంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన జయలలిత జీవితం ఆధారంగా చాలా కాలంగా చిత్రాన్ని తీయాలి అనుకుంటున్నారు. కాని కుదరడం లేదు.
ఇప్పుడు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో కీర్తి నటించబోతున్నారని,కీర్తి కూడా అందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయమై కీర్తి సురేష్ నుంచి గాని,దర్శక నిర్మాతల నుంచి గాని ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.