• మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన కుక్క
  • 2013లో దత్తత తీసుకోవాలనుకున్న ధోనీ
  • ఆ కుక్క తన ఫ్రెండ్‌ అని చెప్పిన జార్ఖండ్‌ డైమండ్

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సెక్యూరిటీ డాగ్ గోల్డెన్ రిట్రీవర్‌తో కలిసి వచ్చిన క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ దాన్ని పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌ అంతా కలియతిరిగాడు. ఈ కుక్క అంటే ధోనీకి చాలా ఇష్టం. దీన్ని 2013లో ఎంసీఏ నుంచి దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లను పూణేలో ఆడుతోన్న నేపథ్యంలో ఈ కుక్క మళ్లీ ధోనీకి కనిపడింది. దాన్ని పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చి తన ఫ్రెండ్ వచ్చిందంటూ అందరికీ పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments