ఓటుకు నోటు 2015 లో సంచలనం సృష్టించింది. ఎంఎల్సి ఎన్నికలప్పుడు టీడీపీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కొనాలని ప్రయత్నించింది. నామినేటెడ్ ఎంఎల్సీ స్టీఫెన్సన్ ను 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేసారు. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి వీడియో ద్వారా రెడ్ హండెడ్ గా పట్టుబడ్డారు. పైగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తో ఫోన్ సంభాషణ కూడా వెలువడి పెను ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు సుప్రీమ్ కోర్ట్ లో ఉంది.

అయితే ఓటుకు నోటు కేసు విషయమై సిఎం కేసిఆర్ సమీక్ష నిర్వహించారు. కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ లో ఆయన పోలీసు అధికారులతో ఈ కేసు పురోగతిపై రెండు గంటల పాటు చర్చించారు.ఈ సమావేశానికి డీజీపీ, ఏసీబీ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి, కొందరు న్యాయనిపుణులు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ నివేదికపై చర్చించారు. నిన్న ఇదే విషయం పై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments