పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత స్థానంలో ఉన్న కధానాయకుడు. హిట్లు,ఫ్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకి అభిమానులను పెంచుకుంటున్న ఏకైక హీరో. అటువంటి ఆయన నాలుగు సంవత్సరాల క్రితం మర్చి 14,2014 న నోవెటల్ హోటల్ వేదికగా జనసేన పార్టీ ని ప్రకటించారు. ఎన్నికలలో పోటీ చేస్తారు అనుకుంటే అనూహ్యంగా టీడీపీ,బీజేపీ కూటమికి మద్దత్తు పలికారు. ఓట్లను చీల్చే ఉద్దేశం లేనందునే తాము పోటీ చేయలేదని స్పష్టం చేశారు.

గత 10 నెలలుగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఆయన పైన ఆరోపణలు చేస్తూ కొన్ని మీడియా ఛానళ్లలో చర్చోపచర్చలు జరిగాయి. కేవలం ఆయన మీదనే పనిగా పదే పదే ప్రసారం చేసాయి. ఇందులో ముఖ్యంగా సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనేక ఆరోపణలు చేశారు. ఫాన్స్ గుడ్లతో అతనిపై దాడి చేసిన విషయం తెలిసినదే. దాని తరువాత కళ్యాణ్ దిలీప్ సుంకర, పవన్ అభిమానుల చొరవతో గొడవ సద్దుమనిగింది.

ఇదిలా ఉండగా పార్టీ ఆవిర్భావ సభలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు మద్దతు పలికిన తెలుగుదేశం పై,ముఖ్యంగా మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసి పవన్ ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య సంఘటనతో తెలుగుదేశం శ్రేణులు తమను తాము కాపాడుకొనే పనిలో పడ్డారు. వారు కూడా పవన్ వ్యక్తి గత జీవితం పై విమర్శలు చేశారు. ఇక నటి శ్రీరెడ్డి సినీరంగంలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ విషయంలో పోరాటానికి దిగారు,అనుకోకుండా విషయం దివేర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైకి మళ్ళింది. తనకి న్యాయం చేయమని శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని కోరగా పవన్ ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని,ఇలా టీవీలలో చెప్పడం సరికాదన్నారు. దీనితో శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని బహిరంగంగా మీడియా ముఖంగా అసభ్య పదజాలంతో దూషించడంతో దీని వెనకాల అధికార,ప్రతిపక్ష కుట్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చేస్తున్న కుట్ర అని అభిమానులు భావిస్తున్నారు.దాని తరువాత మీడియా వారు అధికారపార్టీ తో కుమ్మక్కై తనపై కుట్ర చేస్తున్నారని,అందువల్ల అలాంటి మీడియాను బహిష్కరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.దాని తరువాత సదరు చానళ్ల యజమానులు పవన్ పై పరువునష్టం దావా కేసు వేయడం తెలిసినదే.

పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రతా సిబ్బంది ని నీయమించింది. ఆ భద్రత సిబ్బంది ప్రభుత్వానికి గూడాచారులుగా పనిచేస్తున్నారని అనుమానంతో పవన్ వెనక్కి పంపేసారు. ఇప్పుడు ఆయన భద్రత పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు జరిగిన సభలలో,అభిమానులు స్టేజి పైకి వచ్చి పవన్ ను కౌగలించుకోవడం జరిగింది.ఇవి కేవలం భద్రతా వైఫల్యం వల్లే జరుగుతున్నాయని,ఇలాగే కనక కొనసాగితే తమ నాయకుడికి ప్రమాదమని అభిమానులు,జనసేన శ్రేణులు భావిస్తున్నారు.ఇటీవల జరిగిన విలేఖరుల సమావేశంలో జనసేన రానున్న ఎన్నికలలో మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తుందని,ఈ నెల 15 నుండి బస్సు యాత్ర చేపడతానని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితిలో తమ అభిమాన నాయకుడు భద్రత గురుంచి అభిమానులు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే అనూహ్యంగా ఒక అభిమాని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కు పవన్ భద్రత రీత్యా ఒక లేఖను రాసారు. ఆ లేఖలో పవన్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఆ లేఖ ఈ విధంగా ఉంది .

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి,

గత కొద్ది నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆపదలో ఉన్నవారికి ఆశా జ్యోతి గా, సామాన్యుల పెన్నిధిగా, నిరుపేదలకు అన్నగా భావిస్తున్న, మీతో కూడా కొనియాడబడ్డ, విశాల దృక్పధం గల జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేడు వాస్తవాలను గ్రహించి టీడీపీ అవినీతిని వేలెత్తి చూపటంతో 2019 ఎన్నికలకు టీడీపీ కన్న కలలు నిర్వీర్యం అయిపోతున్నాయనే భావంతో ఆయన మీదే కాక ఆయన కుటుంబ సభ్యుల పై కూడా తమ అనుకూల మీడియా తో అనుచిత వ్యాఖ్యలు చేయించటంతో పవన్ గారి కీర్తిని, విలువను దిగజార్చాలని ప్రయత్నించింది. అయితే అది వికటించి చివరికి అధికారి పార్టీ పతనానికే దారి తీసిందని చంద్రబాబు ప్రభుత్వం గ్రహించింది. దీనితో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉన్మాద చర్యలకైనా తెగబడగలదని ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల బట్టి తెలుస్తుంది.

గతంలో కూడా ఇదే ప్రభుత్వ హయాం లో ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత ప్రజాదరణ కలిగిఉండే ప్రజా ప్రతినిధి శ్రీ వంగవీటి మోహన రంగా గారిని పోలీసుల సమక్షంలోనే అత్యంత కిరాతకంగా హతమార్చడం జరిగింది.కొన్ని నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చమని కోరుతూ తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి పై మరియు వారి కుటుంబ సభ్యుల పై కూడా పోలీసుల చేత అనుచిత వ్యాఖ్యలు చేయించి, వారిపై లాఠీలు ఝుళిపించి అప్రజాస్వామికంగా అత్యంత క్రూరంగా వ్యవహరించి, వారిని హాస్పిటల్ లో బంధించి కనీసం మీడియా ను కూడా అనుమతించకుండా వ్యవహరించిన తీరు చంద్రబాబు నిరంకుశత్వానికి పరాకాష్ట.

దీనిని బట్టి ఆయనలోని క్రూరత్వం గ్రహించి నేడు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2019 ఎన్నికలు ముగిసే వరకు ‘Z’ సెక్యూరిటీ ని కల్పించవలసిందినంగా, ఒక సామాన్యుడిగా, పార్టీలకు అతీతంగా నేను మిమ్ములను కోరుతున్నాను. ఇది అనేక లక్షల మంది అభ్యర్ధన.

దీన్ని చేంజ్.ఆర్గ్ అనే వెబ్సైటు ద్వారా ప్రధాన మంత్రి వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments