ఈ మధ్య టాలీవుడ్ టాప్ హీరోల మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావారణం నడుస్తుంది. ఒకరి సినిమా ఫంక్షన్‌కి మరొకరు, ఒకరి సినిమా పార్టీకి మరొకరు ఇలా హీరోల మధ్య మంచి బాండింగ్ నడుస్తోంది. సినిమాల విడుదల విషయంలో కూడా ప్రతి సినిమాకు కనీసం 2 వారాల గ్యాప్ ఉండేలా హీరోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా నెట్‌లో సంచరిస్తున్న ఓ పిక్‌ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటే అతిశయోక్తి ఉండదేమో..!

రామ్ చరణ్, ఉపాసన దంపతులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణీతల వెడ్డింగ్ యానివర్శరీని సెలబ్రేట్ చేస్తున్న ఫొటో ఇది. ఈ ఫొటోలో యంగ్ టైగర్ తనయుడు.. ఉపాసన ఒడిలో కూర్చుని ఉండటం, చరణ్ ‌పై ఎన్టీఆర్ చేయు వేసి నిలబడటం వంటి దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ ఫొటో చూసిన వారు ఇంకేం కావాలి.. అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారంటే.. ఈ ఫొటోకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఫొటో మరొక్కసారి మెగా, నందమూరి హీరోల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను బయటపెట్టడమే కాకుండా వారి అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments