తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు అభిమానులతో ఈ విషయం పై చర్చలు జరిపిన విషయం తెలిసినదే. మరో తమిళ్ సూపర్ స్టార్ కమలహాసన్ “మక్కల్ నీది మయ్యం” పేరుతో ఒక పార్టీని ప్రకటించారు,ప్రకటన వేడుకకు న్యూడిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రావడం విశేషం. అయితే తలైవా తన రాజకేయ అరంగేట్రం గురుంచి ఈ నెల 9 న జరగోబోయే కాలా ఆడియో వేడుకలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది…