సామాన్యంగా వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా,రాజకీయ అంశాలు నలుగురిలో నానాలి. కాని జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో ఇది విరుద్ధంగా జరుగుతోంది. సెలబ్రిటీ కావడంతో తన కుటుంబ వ్యవహారాలూ,పెళ్ళిళ్ళ విషయంలో వివిధ చర్చలు జరుగుతున్నాయి. పార్టీ వ్యవహారాలు మాత్రం చాలా గోప్యంగా జరుగుతున్నాయ్. ప్రతీవిషయానికి పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి తెచ్చి తన వ్యక్తిగత జీవితాని టార్గెట్ చేసి బలహీన పరిచే పనిలో పడ్డారు. దానికి ఉదాహరణ వ్యూహకర్త దేవ్ ఉదంతం. కనీసం పార్టీ శ్రేణులతో,నాయకులతో చర్చలు జరపకుండా నిర్ణయాలు తీసుకున్తునారు పవన్. వ్యూహకర్త విషయంలోనూ అదే జరిగింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు జనసేన తనను తాను కాపాడుకునే పనిలో పడింది..
అటు పీకే..ఇటు దేవ్
ప్రశాంత్ కిషోర్,ఈయన అనేక పార్టీలకు వ్యూహకర్త గా వ్యవహరించారు. 2014 ఎన్నికలలో ప్రధానమంత్రిగా నరేంద మోదీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. బీజేపీ సోషల్ మీడియాను శాసించారు. కాంగ్రెస్ రాహుల్ టీం బయపడడానికి కూడా కారణం ఈయనే .తరువాత బీహార్ లో జేడీఏ పార్టీకు కూడా వ్యూహకర్త ఈయనే .ఆ సమయంలో బీజేపీ కు మైత్రి చేకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. వైసీపీ కి బీజేపీ కు ముందు సానిహిత్య సంబంధాలు లేవు. కాని ఏడాది కాలంగా చూస్తుంటే వైసీపీ బీజేపీ కి దగ్గరవ్వడం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ప్రశాంత్ కిషోర్. రాష్త్రంలో తెలుగుదేశం గ్రాఫ్ క్రమంగా పడిపోవడం,వైసీపీ గ్రాఫ్ పెరగడం దీని వెనుక పీకీ వ్యూహాలు ఫలిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సమావేశంలో దేవ్ ను జనసేన వ్యూహకర్తగా,ఆయన పది నెలల నుండి పార్టీ కి పనిచేస్తున్నట్టు తెలిపారు. మనం చూస్తే దాదాపు 10 నెలల నుండే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి దూరమవ్వడం మొదలుపెట్టారు. టీడీపీ తో ఉంటే జనసేన స్వతంత్రంగా ఎదగడం కష్తం అన్న విషయాన్ని దేవ్ పవన్ కు నూరిపోసి ఉండొచ్చు. కనీసం ప్రతిపక్ష వైసీపీ స్థానంలోకి రావాలన్న మిత్రపక్షంగా ఉంటే సరిపోదు. మిత్రపక్షంగా ఉంటే పదో పరకో సీట్లతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది,అదే స్వతంత్రంగా పోటీ చేస్తే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 2024 నాటికి జనసేన అధికారంలోకి రావాలి ప్రయత్నిస్తోంది.చంద్రబాబు,టీడీపీ నేతల మీద ఉన్న ఓటుకు నోటు,కాల్ మనీ కేసులు,చంద్రబాబు వారసుడిగా లోకేష్ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోవడం వంటివి తెలుగుదేశాన్ని బలహీన పరిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ అధినేత మరియు నాయకుల మీద ఉన్న కేసుల వల్ల బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. అధికార,ప్రతిపక్షాలు ఉన్న బలహీనతల వల్ల జనసేన పక బలమైన ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి దూరమవుతున్నారని సమాచారం. ఇందులో దేవ్ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. తన అంతర్గత సర్వే ద్వారా చూస్తే 2019 లోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని దేవ్ తెలిపినట్టు సమాచారం. అందువల్ల దేవ్ వ్యూహాలు,సమీకరానాలు నచ్చి పవన్ అతన్ని తమ రాజకీయ వ్యూహకర్త ప్రకటించారు. అయితే దేవ్ గతంలో బీజేపీ లో క్రియాశీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరగడంతో జనసేన ఆత్మరక్షణలో పడిపోయింది. జనసేనని తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి బీజేపీ దేవ్ ను ఒక అస్త్రంగా ప్రయోగించిందా అన్న అనుమానం తలెత్తుతోంది. ప్రశాంత్ కిషోర్ గతంలో బీజేపీ కి పనిచేసినా ఎక్కడా కూడా కలిసిన సందర్భాలు లేవు. కాని దేవ్ బీజేపీ కార్యక్రమ్మాల్లో పాల్గొన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలా సమాధానం ఇస్తారో చూడాలి…