విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక రోజు దీక్ష చేపట్టారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆయన తన అనుచరులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో విఫలమైన కేంద్రం… రైల్వే జోన్‌పై కూడా విముఖత వ్యక్తం చేస్తోందని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments