దాచేపల్లి మైనర్ బాలిక అత్యాచార ఘటన గురుంచి అందరికీ తెలిసిందే. దాని గురుంచి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. అందుకు వైసిపీ ఎంఎల్ఏ ఆర్.కే రోజా ఘాటుగా స్పందించారు. సుబ్బయ్య టీడీపీ సభ్యుడని, సీఎం ప్రతీ వైఫల్యాన్ని వై సి పీ మీద రుద్దుతున్నాఋ. అధికార పార్టీ నేతలే రాజకీయం చేస్తున్నారు, మా పోరాటం వల్లే సీయం వెళ్లి బాదితురాలిని పరామర్శించారన్నారు. మీ పాలనలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నందుకు బావిలో దూకాలన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే వారి నేతలపై ఉన్న 800 కేసులు ఎత్తేసారన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని. ఆరోజు అసెంబ్లీ లో కాల్ మనీ వ్యవహారంలో టీడీపీ వాళ్ళు ఉన్నారని అన్నందుకు తనను ఒక సంవత్సరం పాటు బహిష్కరరించారని.టీడీపీ మంత్రులు,నేతలే ఆంబోతులన్నారు. తెలుగుదేశం పాలనలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు…

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments